Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 10, 2026Short Read
6 లక్షల పింఛన్ల తొలగింపుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ – వైఎస్సార్సీపీ ఆరోపణల్లో నిజం లేదు
ఏపీ ప్రభుత్వం 6 లక్షల పింఛన్లను తొలగించిందన్న వైఎస్సార్సీపీ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
గత 2 ఏళ్లలో పింఛన్ల కోసం రూ.73 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.
కొత్త పింఛన్ల కోసం కేవలం 2 రోజుల్లోనే 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
అప్లికేషన్ల పరిశీలనకు పాత నిబంధనలనే అనుసరిస్తున్నామని చెప్పారు.
ఇక డప్పు కళాకారులు, చర్మకారులు సెల్ఫ్ డిక్లరేషన్తోనే అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.





